Latest Trending News
Latest Trending News: Latest Telugu News and Trending News, Trending News about Telugu movies, politics, daily news, news hunt, tv news, Moview news,andhra pradesh news,telangana news,ap news,ts news,eenadu news,sakshi news, tv5,tv9 news,Fresh news,latet updates, sex news,Trending romantic stories.
ఉల్లి ధరలు తగ్గుతాయ్.. కేంద్రం కీలక నిర్ణయం.. ‘మహా’ ఎన్నికలతో మనకు ఊరట!
మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఉల్లి దిగుబడి తగ్గింది. దీంతో ధరలు భారీగా పెరిగాయి. ఉల్లి ధరలను తగ్గించడం కోసం కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఉల్లి ఘాటును తగ్గించే దిశగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి ధరలు భారీగా పెరగడంతో.. ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్రం.. తాజాగా ఉల్లిపాయలను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. అక్టోబర్ చివరి నాటికి 2 వేల టన్నుల ఉల్లి దిగుమతి కోసం ప్రభుత్వం టెండర్లను ఆహ్వానిస్తోంది. మహారాష్ట్రలో భారీ…
అటు ప్రభుత్వం..ఇటు ప్రతిపక్షాలు: మధ్యలో ఆర్టీసీ కార్మికులు: సమ్మె నేడు కొత్త టర్న్..!
ఆర్టీసీ కార్మికులు: సమ్మె నేడు కొత్త టర్న్: తెలంగాణలో ఆర్టీసీ సమ్మె అయిదో రోజుకు చేరింది. ఈ రోజు నుండి సమ్మెను ఉధృతం చేస్తామని కార్మిక సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. ఇదే సమయంలో దీనిని రాజకీయంగా తమకు అనుకూలగా మలచు కొనేందుకు..ప్రభుత్వం పైన పై చేయి సాధించేందుకు ప్రతిపక్షాలు దీనిని అవకాశంగా మలుచుంటున్నాయి. అందులో భాగంగా ఈ రోజుల అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసారు. ఒక వైపు ప్రభుత్వం ఉద్యోగులు సెల్ఫ్ డిస్మిస్ చేసుకున్నారంటూ ముఖ్యమంత్రి…
అన్నవరంలో హైదరాబాద్ జంట ఆత్మహత్య
తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. స్నేహా రెసిడెన్సీలో ఇద్దరు ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. లాడ్జ్ సిబ్బంది ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. బంధువులకు సమాచారం అందించారు. మృతులు హైదరాబాద్‌కు చెందిన పవన్, దివ్యలక్ష్మీగా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. వీరికి ట్రావెల్స్ వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. అంతేకాదు…
విశాఖ జిల్లాలో విరిగిన రైలు పట్టా.. రైళ్ల రాకపోకలపై ఎఫెక్ట్
కసింకోట వద్ద రైల్వే ట్రాక్ విరిగింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు రైల్వే అధికారులకు సమాచారం అందించారు. దీంతో పలు రైళ్ల రాకపోకలపై ప్రభావం పడింది. విశాఖపట్నం జిల్లా కసింకోట మండలంలోని బయ్యవరం-పరవాడపాలెం మధ్య రైలు పట్టా విరిగింది. రైలు పట్టా విరగడం గమనించిన స్థానికులు వెంటనే గుర్తించి రైల్వే అధికారులకు సమాచారం అందించారు. సకాలంలో అధికారులు స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. పట్టా విరగడంతో విజయవాడ-విశాఖ నగరాల మధ్య నడిచే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది….
అమలాపురం లో బాలికను కిడ్నాప్ చేసి 23రోజుల పాటు అత్యాచారం
అమలాపురం గ్రామీణ వార్తలు: ఇంటర్ చదువుతున్న 16ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడిని అమలాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు 14రోజుల రిమాండ్ విధించడంతో అతడిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలంలో 16ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పి.గన్నవరం మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ బాలిక అమ్మమ్మ ఇంట్లో ఉంటూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. రోజూ…
నగరంలో రెండు రోజులు భారీ వర్షాలు: జీహెచ్‌ఎంసీ కమిషనర్
హైదరాబాద్: హైదరాబాద్‌లో రోడ్లను యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నగరంలో తక్షణం చేపట్టాల్సిన పనులపై సమీక్ష చేసి మీడియాతో మాట్లాడారు. ‘దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. నీరు నిలిచి ఉన్న దగ్గర ఆయిల్ బాల్స్ వేస్తున్నాం. వర్షానికి పడిన గుంతలను వెంటనే మరమ్మతులు చేస్తున్నాం. వర్షాల వల్ల గ్రేటర్‌లో చాలా చోట్ల రోడ్లు కోతకు గురయ్యాయి. గంటకు రెండు సెం.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైతే…
రుషికొండ బీచ్‌లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
విశాఖపట్నం : ఉన్నత చదువులు చదివినా.. ఉద్యోగం రాలేదని మనస్థాపానికి గురైన యశ్వంత్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన విశాఖపట్నంలోని రుషికొండ బీచ్‌లో ఆదివారం జరిగింది. బీటెక్ పూర్తి చేసిన యశ్వంత్ ఉద్యోగాన్వేషణలో భాగంగా విశాఖలోని ఎంవీపీ కాలనీలో నివాసముంటున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాలేదన్న మనస్థాపంతో రుషికొండ బీచ్‌లో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా మృతుడు విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం వాసిగా గుర్తించారు.
ఇకపై అందుబాటులోకి రానున్న whatsapp బ్యాంకింగ్ సేవలు
వాట్సాప్.. స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతిఒక్కరూ ఈ యాప్‌ను ఉపయోగిస్తూ ఉంటారు. పాపులర్ మెసేజింగ్ యాప్ ఇది. ఇప్పుడు బ్యాంకులు కూడా వాట్సాప్‌ను తెగ వాడేసేందుకు సిద్ధమౌతున్నాయి. వాట్సాప్ బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నాయి. హైలైట్స్: వాట్సాప్ బాట పడుతున్న బ్యాంకులు ఇప్పటికే వాట్సాప్ సేవలు అందిస్తున్న చాలా బ్యాంకులు మిని స్టేట్‌మెంట్ నుంచి ప్రిఅప్రూవ్డ్ రుణాల వరకు పలు సర్వీసులు దేశంలోని దిగ్గజ బ్యాంకులు ఇప్పుడు పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ బాట పట్టాయి. కస్టమర్లకు రియల్‌టైమ్ సర్వీసులు…
ఆదుకున్న ఎల్గార్, డికాక్
– దక్షిణాఫ్రికా 385/8 – అశ్విన్ 123/5 – భారత్ తొలి ఇన్నింగ్స్: 502/7(డిక్లేర్డ్) – దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 358/8 (ఎల్గార్ 160, డికాక్ 111, డుప్లెసిస్ 55, అశ్విన్ 5/128, జడేజా 2/116) స్పోర్ట్స్ డెస్క్ దక్షిణాఫ్రికాతో విశాఖపట్నం వేదికగా జరుగుతున్న తొలిటెస్ట్లో భారత్ పట్టు బిగిస్తోంది. గురువారం మూడోరోజు ఆటముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 385 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా జట్టులో ఎల్గార్(160), డికాక్(111), కెప్టెన్ డుప్లెసిస్(55) రాణించారు. ఓవర్నైట్ స్కోర్…
