‘వర్క్ ఫ్రమ్ హోమ్‌’పై సత్య నాదెళ్ల కీలక వ్యాఖ్యలు..!

కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక లాక్‌డౌన్ ఎత్తేసినప్పటికీ కొన్ని బడా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌ను పెంచుతున్నట్లు కూడా ప్రకటించాయి. అంతేకాదు భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను ఎదుర్కోవడం కోసం ఇంటి నుంచే పనిచేయించుకోవాలని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్‌పై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల కీలక వ్యాఖ్యలు చేశారు. శాశ్వతంగా ఇంటి నుంచి పని చేయడం వల్ల ఉద్యోగులకు కీడు…

Read More

ప్రభుత్వరంగ సంస్థలు ప్రైవేటు చేతికి

*ప్రభుత్వరంగ సంస్థలు ప్రైవేటు చేతికి* *మిగిలేవి గరిష్ఠంగా నాలుగే* *ఉపాధి హామీకి మరో రూ.40,000 కోట్లు* *రాష్ట్రాలకు రుణ పరిమితి పెంపు* *తుది విడత ప్యాకేజిని ప్రకటించిన నిర్మలా సీతారామన్‌* *మొత్తం విలువ రూ.21 లక్షల కోట్లు* కరోనా ప్రభావం నుంచి దేశాన్ని గట్టెక్కించడానికి ఉద్దీపన ప్యాకేజిని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఆదివారం మరిన్ని కీలక నిర్ణయాలు వెలువరించింది. చిన్న పరిశ్రమలకు చేయి అందిస్తూనే.. వ్యూహాత్మకం కాని రంగాల్లో ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ)లను ప్రైవేటీకరించాలని నిర్ణయించింది….

Read More

సాక్షర భారత్‌ స్థానే కొత్త పథకం

*సాక్షర భారత్‌ స్థానే కొత్త పథకం* *55లక్షల మందిని అక్షరాస్యులను చేయడం ఈ ఏడాది లక్ష్యం* దేశవ్యాప్తంగా అక్షరాస్యత పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘పఢ్‌నా లిఖ్‌నా అభియాన్‌’ పథకానికి శ్రీకారం చుట్టింది. పదేళ్ల పాటు కొనసాగిన సాక్షర భారత్‌ను రద్దుచేసిన కేంద్రం దాని స్థానంలో కొత్త పథకాన్ని తెరపైకి తెచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 15 ఏళ్లు పైబడిన వారిలో 55లక్షల మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రాలకూ లక్ష్యాలను నిర్దేశించింది….

Read More

నిర్లిప్తానికి లాక్‌డౌన్‌! *పోటీ పరీక్షలకు స్మార్ట్‌ కిటుకులు

*నిర్లిప్తానికి లాక్‌డౌన్‌!* *పోటీ పరీక్షలకు స్మార్ట్‌ కిటుకులు* వారాల తరబడి లాక్‌డౌన్‌ అనిశ్చితిలో చిక్కుకుని, ప్రవేశ పరీక్షలకు తయారవ్వాల్సిరావటం ఇప్పుడు విద్యార్థులకు ఎదురవుతున్న సవాలు! లేనిపోని ఆందోళనలకూ, ఒత్తిడికీ తావివ్వకుండా, తొట్రుపాటుకు గురవ్వకుండా సబ్జెక్టుల అధ్యయనంపై పూర్తి దృష్టిని కేంద్రీకరించాల్సిన సమయమిది. అయితే.. పాఠ్యాంశాల సారం గ్రహించే సందర్భంగా చేసే పొరపాట్లతో సన్నద్ధతలో అవరోధాలు ఏర్పడే అవకాశముంది. అవేమిటో… తెలుసుకుని లోపాలను సవరించుకుంటే సమగ్రంగా తయారై ధీమాగా పరీక్షలను రాయొచ్చు! కొవిడ్‌-19 వైరస్‌ను మానవాళి ఎదుర్కొంటున్న ఈ…

Read More

విద్యార్థినులకు స్కాలర్‌షిప్‌ చండీగఢ్‌ యూనివర్సిటీ మాతృదినోత్సవ కానుక

*విద్యార్థినులకు స్కాలర్‌షిప్‌* *చండీగఢ్‌ యూనివర్సిటీ మాతృదినోత్సవ కానుక●* *దూరవిద్యా కోర్సుల్లో అమలు* దూరవిద్య ద్వారా తమ కలలను సాకారం చేసుకోవాలనుకునే విద్యార్థులు ఎందరో. వీరిలో మహిళలను ప్రోత్సహించే ఉద్దేశంతో చండీగఢ్‌ యూనివర్సిటీ ఓ అవకాశాన్ని ఇస్తోంది. వారికోసం ‘విమెన్‌ ఎంపవర్‌మెంట్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌’ను అందిస్తోంది. చదువు మధ్యలో ఆపేసిన, ఉద్యోగాలు చేస్తున్న స్త్రీలు ఎవరైనా ఈ అవకాశాన్ని అందుకోవచ్చు. పంజాబ్‌లోని చండీగఢ్‌ యూనివర్సిటీ అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా విమెన్‌ ఎంపవర్‌మెంట్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం…

Read More

దేశంలో 96,169కి చేరిన కరోనా కేసుల సంఖ్య* దిల్లీ

*దేశంలో 96,169కి చేరిన కరోనా కేసుల సంఖ్య* దిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 5వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. దీంతో సోమవారం (ఉదయం 8 గంటలు) నాటికి దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 96,169కి చేరింది. యాక్టివ్‌ కేసులు 56,316 ఉండగా.. 36,824 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు 3,029 మంది కరోనాతో మృతి చెందారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 47.10లక్షలకు చేరాయి….

Read More

రేపటి నుంచి ఆర్టీసీ బస్సులు తిరుగుతాయి: కేసీఆర్‌

*రేపటి నుంచి ఆర్టీసీ బస్సులు తిరుగుతాయి: కేసీఆర్‌* హైదరాబాద్‌: రేపటి నుంచి ఆర్టీసీ బస్సులు తిరుగుతాయని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ‘‘అంతర్రాష్ట్ర బస్సులు అనుమతించట్లేదు. హైదరాబాద్‌లో ఆటోలు, కార్లు తిరగటానికి అనుమతి ఇస్తాం కాని సీటీ బస్సులు తిరగవు. హైదరాబాద్ నగరం తప్ప అన్ని చోట్లా అన్ని దుకాణాలు తెరుచుకోవచ్చు. హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎక్కడ దుకాణాలు తెరవాలో ప్రకటిస్తారు. మెట్రో రైళ్లు, సినిమా హాళ్లు, ఫంక్షన్‌ హాళ్లు, అన్ని రకాల విద్యాసంస్థలకు అనుమతి లేదు. మాస్కులు…

Read More

‘అంపన్’‌.. సూపర్‌ సైక్లోన్‌గా మారే అవకాశం!

*‘అంపన్’‌.. సూపర్‌ సైక్లోన్‌గా మారే అవకాశం!* *సాయంత్రం 4గంటలకు ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష* *అప్రమత్తమైన ఒడిశా, బెంగాల్‌ ప్రభుత్వాలు* దిల్లీ: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అంపన్‌ అతి తీవ్ర తుపానుగా కొనసాగుతోంది. ప్రస్తుతం పారాదీప్‌కు దక్షిణంగా 780 కి.మీల దూరంలో, బెంగాల్‌లోని దిఘాకు 930 కి.మీల దూరంలో కేంద్రీకృతమైన ఈ పెను తుపాను ఈ సాయంత్రానికి సూపర్‌ సైక్లోన్‌గా మారే అవకాశం ఉందని హోంమంత్రిత్వశాఖ తెలిపింది. ఈ తుపాను తీవ్రతపై సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ…

Read More

CBSE 12th Exam Schedule

సాక్షి, న్యూఢిల్లీ : సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. జూలై 1 నుంచి 15 వరకు 12వ తరగతి పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షలకు ప్రతి ఒక్క విద్యార్థి మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలని నిబంధన విధించారు. అలాగే సానిటైజర్స్‌తో రావాలని సీబీఎస్‌ఈ తెలిపింది. అనారోగ్యంగా ఉన్న విద్యార్థులను పరీక్షలకు అనుమతించరని ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దేశంలోని 3 వేల సీబీఎస్ఈ పాఠశాలలను మూల్యాంకన కేంద్రాలుగా…

Read More