కోవిడ్ బలహీన పడింది
భారత్కు వచ్చేసరికి రూపు మార్చుకుంది ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డా.డి.నాగేశ్వరరెడ్డి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్-19 వైరస్ భారత్కు వచ్చేసరికి దాని రూపు మార్చుకుని బలహీనపడిందని ప్రముఖ గ్యాస్ట్రొ ఎంటరాలజిస్ట్ డా.డి.నాగేశ్వరరెడ్డి చెప్పారు. చైనాలోని వుహాన్లో పుట్టిన ఈ వైరస్.. అక్కడ బలపడి యూరప్ దేశాలకు విస్తరించిందని, అప్పటికే మ్యుటేషన్ (రూపాంతరం) చెంది ఇటలీలో బీభత్సం సృష్టించిందని తెలిపారు. ఆ తర్వాత మెల్లగా స్పెయిన్, ఫ్రాన్స్ దేశాల్లో విస్తరించాక, ఇండియాకు చేరిందన్నారు. అయితే ఆసియా దేశాలకు వచ్చేసరికి మరోసారి మ్యుటేషన్ చెంది…
