బంగారు రంగు పులి
విశాల భారతదేశంలో అటవీప్రాంతానికి కొదవలేదు. అదేస్థాయిలో అపారమైన జీవవైవిధ్యం కూడా భారత్ సొంతం. అనేక వన్యప్రాణులకు మనదేశం ఆవాసంగా ఉంది. అయితే, ఎంతో అరుదైన బంగారు రంగు పులి మాత్రం దేశంలో ఒక్కటి మాత్రమే ఉంది. ఆ ఒక్కటీ ఇటీవలే కజిరంగా అడవుల్లో దర్శనమిచ్చింది. సాధారణ పులులకు భిన్నంగా ఇది పసిడి వర్ణంలో మెరిసిపోతుంటుంది. దీని ముఖం కూడా ఇతర వ్యాఘ్రరాజాలకు భిన్నంగా కనిపిస్తుంది. ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కాశ్వాన్ దీని ఫొటోను ట్విట్టర్ లో పంచుకున్నారు….
