‘నా భర్త కొడుతున్నాడు, కాపాడండి’ – దిశ యాప్లో కుటుంబ సమస్యల ఫిర్యాదులే అధికం అంటున్న పోలీసులు
ఆపద సమయాల్లో మహిళల రక్షణ కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్లో ఎక్కువగా కుటుంబ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులే వస్తున్నాయని ఈనాడు ఓ కథనాన్ని ప్రచురించింది. నాలుగు రోజుల్లో సుమారు 50 వేల మంది డౌన్ లోడ్ చేసుకున్నారని తెలిపింది. విశాఖ, కృష్ణా జిల్లాల నుంచి భర్తల వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులు రాగా, సోదరుని వరుసయ్యే వ్యక్తి వేధిస్తున్నాడంటూ పశ్చిమగోదావరి జిల్లా నుంచి, అలాగే ఓ వ్యక్తి తనను తరచు వేధిస్తున్నాడంటూ తూర్పు గోదావరి జిల్లా నుంచి…
