లాక్‌డౌన్ సమయంలో భారత్‌కు సంజీవని
ప్రపంచంలోనే అతి పెద్ద పోస్టల్ సర్వీస్ భారతదేశానిది. కరోనావైరస్ మహమ్మారిని నియంత్రించటానికి లాక్‌డౌన్‌లో ఉన్న దేశంలో ఇప్పుడు ప్రాణాలను రక్షించే మందులు, పరికరాలను గమ్యస్థానాలకు చేరవేయటానికి తపాలా శాఖ రంగంలోకి దిగుతోంది. బీబీసీ ప్రతినిధి ఆయేషా పెరేరా కథనం. ఎరుపు రంగు పోస్టల్ వ్యాన్లు దేశంలో అందరికీ పరిచయమున్న వాహనాలు. దేశంలోని ఆరు లక్షల గ్రామాల్లో ఉన్న పోస్టాఫీసుల వ్యవస్థ మధ్య ఈ వాహనాలు అనునిత్యం వేలాది ప్రయాణాలు చేస్తుంటాయి. ఈ తపాలా శాఖ.. లేఖలు, పార్సిళ్లు సరఫరా చేయటమే…
