పిల్లర్లపై హైస్పీడ్‌ రైలు?

Spread the love

highspeed-train-on-hollow-pillars

పిల్లర్లపై హైస్పీడ్‌ రైలు?

జాతీయ రహదారుల వెంట ఎలివేటెడ్‌ కారిడార్‌

హైదరాబాద్‌-ముంబయి సహా 7 మార్గాల్లో ఇదే పద్ధతి

రైల్వేశాఖ తాజా ప్రతిపాదన

హైదరాబాద్‌: ముంబయి-పుణె-హైదరాబాద్‌ సహా హైస్పీడ్‌ కారిడార్ల విషయంలో రైల్వేశాఖ కీలక ప్రతిపాదన చేసింది.

ఈ ప్రాజెక్టులను కొత్తగా భూమి సేకరించి కాకుండా ఇప్పటికే ఉన్న జాతీయ రహదారుల వెంట ఎలివేటెడ్‌ కారిడార్లుగా నిర్మించాలని ప్రతిపాదించింది.

జాతీయ రైల్వే ప్రణాళిక (నేషనల్‌ రైల్‌ ప్లాన్‌) ముసాయిదాను కొద్దిరోజుల క్రితం ప్రకటించిన రైల్వేశాఖ అందులో తెలంగాణ సహా దేశవ్యాప్తంగా రైల్వే నెట్‌వర్క్‌ అభివృద్ధికి పలు ప్రతిపాదనలు చేసింది.

ముంబయి-హైదరాబాద్‌తో పాటు మొత్తం ఏడు కొత్త హైస్పీడ్‌ కారిడార్లను నిర్మించనున్నట్లు పేర్కొంది.
హైస్పీడ్‌ రైళ్లు అత్యంత వేగంగా ప్రయాణిస్తాయి.

గంటకు 320-350 కిమీ వేగంతో ప్రయాణించేలా హైస్పీడ్‌ కారిడార్‌ ప్రాజెక్టును రైల్వేశాఖ తీసుకువస్తోంది. ఇంత వేగంగా రైళ్లు ప్రయాణం చేయాలంటే.. దాన్ని తట్టుకునేలా ప్రత్యేకమైన ట్రాక్‌ ఉండాలి. అంటే ప్రస్తుత మార్గంలో ఉన్న ట్రాక్‌ కాకుండా కొత్తది నిర్మించాల్సి ఉంటుంది.

దీనికి పెద్దమొత్తంలో భూసేకరణ చేయాల్సి ఉంటుంది. ముంబయి-అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుకు ప్రధానంగా ఎదురవుతున్న సమస్య భూసేకరణే. ఇప్పటివరకు 68శాతమే భూసేకరణ జరిగింది.

ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకున్న రైల్వేశాఖ కొత్త హైస్పీడ్‌ కారిడార్లను జాతీయ రహదారుల వెంట ఎలివేటెడ్‌ కారిడార్లుగా నిర్మించాలని ప్రతిపాదించింది.

 


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading