మెట్రోస్టేషన్‌లో మరో సదుపాయం..!

Spread the love

[the_ad id=”4846″]

హైదరాబాద్‌ మెట్రోస్టేషన్‌లలో మరో సదుపాయం అందుబాటులోకి వచ్చింది. అదేంటంటే మెట్రోస్టేషన్‌లలో పవర్‌బ్యాంక్‌లను అందుబాటులోకి తీసుకువచ్చారు. కావలసిన వారు ఈ పవర్‌బ్యాంకులను రూ.199 డిపాజిట్‌ చేసి అద్దెకు తీసుకోవచ్చు. పవర్‌ బ్యాంకుకు ఒక గంటకు ఛార్జీ 3రూ కాగా 24 గంటల వరకూ 9రూ చెల్లించాలి. దీనిని ఏడాదికి 699 రూ..

చందా కట్టి ఎన్నిసార్లయినా వాడుకునే సదుపాయం కూడా కలదు. కావాలంటే పవర్ బ్యాంక్‌ను ఇంటికి తీసుకువెళ్లి కూడా వాడుకోవచ్చు. ఇప్పటికే హైదరాబాద్‌ మెట్రో తెలంగాణకు తలమానికంగా ఉండగా ఇలాంటి సదుపాయాలతో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందే అవకాశముంది.

కాగా ఈ సదుపాయాన్ని ప్లగ్‌ అనే సంస్థ మెట్రోసౌజన్యంతో అందుబాటులోకి తీసుకువచ్చింది.ప్రస్తుతం 20 స్టేషన్‌లలో పవర్‌బ్యాంక్‌ లను అందుబాటులో ఉంచగా క్రమంగా అన్ని స్టేషన్‌లలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు అధికారులు తెలిపారు. కాగా మెట్రోస్టేషన్‌లో పవర్‌బ్యాంకులు అందుబాటులోకి తీసుకురావడం ఎంతో ఉపయోగకరమని ప్రయాణీకులు భావిస్తున్నారు

[the_ad id="4846"]


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading