తాజా నిర్ణయం: దాదాపుగా 8.21 లక్షలమంది మహిళలకు వైఎస్సార్‌ చేయూత

మహిళల ఉపాధిమార్గాలను మెరుగుపరచడం, తద్వారా ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు, వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న వైఎస్ఆర్‌ చేయూత పథకాన్ని మరింత విస్తరించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్ణయించారు. సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన మహిళల కష్టనష్టాలను పరిగణలోకి తీసుకున్న సీఎం- ఇప్పటికే వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కింద ప్రతి నెలా పెన్షన్‌ అందుకుంటున్న వారికీ వైఎస్సార్‌ చేయూత కింద నాలుగేళ్లలో రూ.75వేలు అందించాలని నిశ్చయించారు. ఈ కీలక నిర్ణయానికి రాష్ట్ర మంత్రివర్గం…

Read More

రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాలు

అమరావతి : ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో వివిధ అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి పేర్ని నాని వెల్లడించారు. రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాలు 1.మరింత మందికి వైయస్సార్‌ చేయూత: ఇప్పటికే పెన్షన్‌ అందుకుంటున్న వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులైన మహిళలు తదితర కేటగిరీ మహిళలకూ చేయూత వర్తింపజేయాలని కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్‌ నిర్ణయం వల్ల ఇప్పటికే పెన్షన్‌ అందుకుంటున్నవారిలో అదనంగా రూ. 8.21…

Read More

ఇన్ఫోసిస్‌ లాభం రూ.4,272 కోట్లు*

*ఇన్ఫోసిస్‌ లాభం రూ.4,272 కోట్లు* *ఆదాయంలో 8.5 శాతం వృద్ధి* *2020-21లో 2 శాతం ఆదాయ వృద్ధి అంచనా* *దన్నుగా నిలిచిన భారీ ఆర్డర్లు* దిల్లీ: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ అంచనాలు మించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) మొదటి త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన కంపెనీ రూ.4,225 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2019-20 ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆర్జించిన రూ.3,802 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది 12.4 శాతం ఎక్కువ. ఇక మొత్తం…

Read More

*నిత్య విద్యార్థిలా నైపుణ్యాలు నేర్చుకోవాలి

*నిత్య విద్యార్థిలా నైపుణ్యాలు నేర్చుకోవాలి* *అప్పుడే మనం ముందుకెళ్లగలం* *నైపుణ్య భారత్‌ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ పిలుపు* దిల్లీ: ఎన్ని చదువులు చదివిన వారైనా జీవితంలో నిరంతరం కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడంపై దృష్టిసారించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. నైపుణ్య భారత్‌ దినోత్సవం (స్కిల్‌ ఇండియా డే) సందర్భంగా ఆయన బుధవారం యువతను ఉద్దేశించి మాట్లాడారు. వేగంగా మారుతున్న ప్రపంచంలో మన అవసరం ఉండాలంటే స్కిల్‌, రీస్కిల్‌, అప్‌స్కిల్‌ సూత్రాన్ని అనుసరిస్తూ పోవాలని సూచించారు. ‘‘కరోనా సంకట…

Read More

రిలయన్స్‌ శంఖారావం

*రిలయన్స్‌ శంఖారావం* *వచ్చే ఏడాదికి స్వదేశీ 5జీ టెక్నాలజీ* *గూగుల్‌తో ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టం* *అందుబాటు ధరలో 4జీ-5జీ స్మార్ట్‌ఫోన్లు* *వర్చువల్‌ సమావేశాల కోసం జియో గ్లాస్‌* *జియోమార్ట్‌తో ఇళ్లకు తాజా కూరలు, పళ్లు* *ఏజీఎం 48 దేశాల్లోని 550 నగరాల నుంచి 3.2 లక్షల మంది వీక్షణ* వచ్చే ఏడాదికి పూర్తి స్వదేశీ 5జీ టెక్నాలజీ సొల్యూషన్‌.. గూగుల్‌ భాగస్వామ్యంతో ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌, చౌకగా 4జీ-5జీ స్మార్ట్‌ఫోన్లు.. ఇ-కామర్స్‌లో దూకుడు.. ఇవీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌…

Read More

*‘పద్మనాభు’ని బాధ్యత ట్రావెన్‌కోర్‌ రాజులదే

*‘పద్మనాభు’ని బాధ్యత ట్రావెన్‌కోర్‌ రాజులదే* *వారికి ఆలయంపై వారసత్వ హక్కు ఉంది* *రహస్య మాళిగపై నిర్ణయం తీసుకునే అధికారం కమిటీకి అప్పగింత* *సుప్రీంకోర్టు తీర్పు* దిల్లీ, తిరువనంతపురం: కేరళ రాజధాని తిరువనంతపురంలోని శ్రీపద్మనాభ స్వామి ఆలయ నిర్వహణపై సుప్రీంకోర్టు సోమవారం కీలక నిర్ణయం వెలువరించింది. ఆలయ నిర్వహణపై ట్రావెన్‌కోర్‌(తిరువనంతపురం) రాజకుటుంబానికి హక్కులు ఉన్నట్టు తీర్పు చెప్పింది. ఆలయ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలని, నిర్వహణకు ప్రత్యేకంగా ట్రస్టు ఏర్పాటు చేయాలంటూ 2011లో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది….

Read More

ఆన్‌లైన్‌ బోధనపై వారంలో విధాన నిర్ణయం

*ఆన్‌లైన్‌ బోధనపై వారంలో విధాన నిర్ణయం* *హైకోర్టుకు నివేదించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం* *పేదలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర విధానం రూపొందించాలన్న హైకోర్టు* హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇప్పటివరకు విద్యా సంవత్సరాన్ని ప్రారంభించలేదని, ఒక వారం గడువిస్తే ఆన్‌లైన్‌ సహా అన్నింటిపై విధాన నిర్ణయం తీసుకుంటామంటూ ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు హామీ ఇచ్చింది. ఇప్పటికే నిపుణుల కమిటీ నివేదిక సమర్పించిందని, దానిపై విధి విధానాల రూపకల్పనలో ప్రభుత్వం ఉందని పేర్కొంది. దీనికి హైకోర్టు అనుమతిస్తూనే ఆదిలాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లోని…

Read More

విద్యార్థుల ప్రతిభను కొలవాల్సిందే

*విద్యార్థుల ప్రతిభను కొలవాల్సిందే: కేంద్రం* దిల్లీ: విశ్వవిద్యాలయాల్లో చివరి సెమిస్టర్‌ పరీక్షలు తప్పక నిర్వహించాలని వర్సిటీలకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) జారీ చేసిన మార్గదర్శకాలపై ఆరు రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ కేంద్రం ఏమాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. యూజీసీ జారీచేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలుచేయాల్సిందేనని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఉద్ఘాటించింది. విద్యా సంవత్సరంలో విద్యార్థి ఎంతమేర నేర్చుకున్నాడనే విషయమై మూల్యాంకనం చేయడం అనేది.. విశ్వసనీయత, ఉద్యోగ అవకాశాలకు కీలకమైన అంశమని…

Read More

బంగారు రంగు పులి

విశాల భారతదేశంలో అటవీప్రాంతానికి కొదవలేదు. అదేస్థాయిలో అపారమైన జీవవైవిధ్యం కూడా భారత్ సొంతం. అనేక వన్యప్రాణులకు మనదేశం ఆవాసంగా ఉంది. అయితే, ఎంతో అరుదైన బంగారు రంగు పులి మాత్రం దేశంలో ఒక్కటి మాత్రమే ఉంది. ఆ ఒక్కటీ ఇటీవలే కజిరంగా అడవుల్లో దర్శనమిచ్చింది. సాధారణ పులులకు భిన్నంగా ఇది పసిడి వర్ణంలో మెరిసిపోతుంటుంది. దీని ముఖం కూడా ఇతర వ్యాఘ్రరాజాలకు భిన్నంగా కనిపిస్తుంది. ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కాశ్వాన్ దీని ఫొటోను ట్విట్టర్ లో పంచుకున్నారు….

Read More