ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐటీ సంస్థ టీసీఎస్
*ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐటీ సంస్థ టీసీఎస్* *యాక్సెంచర్‌ను అధిగమించేసింది* దిల్లీ: టీసీఎస్ ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐటీ సేవల సంస్థగా అవతరించింది. యాక్సెంచర్‌ను వెనక్కినెట్టి ఈ ఘనత సాధించింది. గురువారం టీసీఎస్ షేరు దూకుడుతో సంస్థ మార్కెట్ విలువ రూ.10,59,973.63 కోట్లకు చేరింది. డాలర్లలో ఈ విలువ 144.73 బిలియన్ డాలర్లు. ప్రస్తుతం యాక్సెంచర్ మార్కెట్ విలువ 142.4 బి.డాలర్లుగా ఉంది. దీంతో మార్కెట్ విలువపరంగా ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో టీసీఎస్ అగ్రస్థానానికి దూసుకెళ్లగా.. యాక్సెంచర్…
