ఎమర్జెన్సీలో ఫోన్ ఊపితే చాలు పోలీసులు వచ్చేస్తారు
ఫోన్ ఊపితే పోలీసులు వచ్చేస్తారంటూ మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన దిశ మొబైల్ అప్లికేషన్ గురించి ఈనాడు ఓ వార్త రాసింది. “ఆపదలో ఉన్న మహిళలకు అత్యవసర సాయం అందించేందుకు రూపొందించిన యాప్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. యాప్‌ను ఓపెన్ చేసి అత్యవసర సహాయ బటన్‌ను నొక్కితే చాలు.. వెంటనే క్షణాల్లో పోలీస్ కంట్రోల్ రూంకి సమాచారం వెళ్లేలా ఈ అప్లికేషన్‌ను రూపొందించారు. సహాయం కోరే సమయం కూడా…
