అధికారికంగా సాగే బెట్టింగ్!
ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. ఈ సందర్భంగా క్రికెట్ మజా గురించి చర్చించే వాళ్ల కన్నా బెట్టింగ్ మీదే జనాల కాన్సన్ ట్రేషన్ ఎక్కువగా నడుస్తూ ఉండటం గమనార్హం. క్రికెట్ లో ఆస్వాధించేంత మజా ఉంది. అయితే జనాలు దీంతో సంతృప్తి చెందుతున్నట్టుగా లేరు. అందరూ కాకపోయినా కొందరు క్రికెట్ మ్యాచ్ లకు సమాంతరంగా బెట్టింగులు వేసుకుంటూ కొత్త మజాను ఆస్వాధిస్తున్నారు. దాన్ని మజా అనడం కన్నా జూదం అనడం మంచిది. దేశంలో ఆ మూల నుంచి ఈ…
