మరి కొద్ది గంటల్లో చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని చేరుకోనున్న చంద్రయాన్ -2 విక్రం లాండర్
Teluguwonders: చందమామపై భారత కీర్తిపతాక రెపరెపలాడే సమయం ఆసన్నమైంది. భారతీయులు ఆశల్ని మోసుకుంటూ జులై 22న నింగివైపు దూసుకెళ్లిన చంద్రయాన్-2 మరి కొద్ది గంటల్లో తన లక్ష్యాన్ని చేరుకోనుంది.భారతీయులే కాదు యావత్తు ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సమయం రానే వచ్చింది. చంద్రుడి ఉపరితలంపై అధ్యయనానికి ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2 నేటి అర్థరాత్రి కీలక ఘట్టానికి సిద్ధమైంది. 👉చంద్రయాన్-2 ..48 రోజుల సుదీర్ఘ ప్రయాణం ఒక ఎత్తైతే, చంద్రుడిపై ల్యాండర్ అడుగుపెట్టడానికి ముందు 15 నిమిషాలు ఒక…
