సచివాలయం ఉద్యోగాలకు ఒక్కో పోస్ట్ కు 19 మంది పోటీ
Teluguwonders: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. గ్రామ సచివాలయ పోస్టులకు దరఖాస్తులు భారీగా అందాయి. నోటిఫికేషన్ ప్రకారం శనివారం(10 ఆగస్ట్ 2019) రాత్రి వరకు దరఖాస్తుకు అవకాశం ఇవ్వగా.. వరదలు, వర్షాల కారణంగా దరఖాస్తు గడువును ఒక్క రోజు పెంచడంతో ఆదివారం(11 ఆగస్ట్ 2019) 58 వేల మంది అదనంగా దరఖాస్తు చేసుకున్నారు. దీంతో మొత్తం 22.7లక్షల మంది అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించారు. రాష్ట్రంలో 13,065 గ్రామ సచివాలయాలు, 3,786 వార్డు…
