సచివాలయ పరీక్షల అభ్యర్థులకు ముఖ్య గమనిక
Teluguwonders: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు జరగనున్నాయి. సెప్టెంబర్ 2 నుంచి పరీక్షలు నిర్వహిస్తారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు అధికారులు ముఖ్య గమనిక జారీ చేశారు. ఒక్క క్షణం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని అనంతపురం జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ తెలిపారు. అభ్యర్థులు అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. గురువారం(ఆగస్టు 22,2019) కలెక్టరేట్‌లో కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. పరీక్షల టైమింగ్స్ వివరించారు. ఉదయం…
